వాహనదారులకు శుభవార్త ఇది. నిన్న మొన్నటి వరకు చుక్కలు చూపించిన ఇంధన ధరలు కాస్త దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు స్థిరంగా కొనసాగుతుండడంతో ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ పై 17 పైసలు, డీజిల్‌పై 18పైసలు చొప్పున తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా తగ్గింపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.26, డీజిల్ ధర 96.69గా నమోదు అయ్యాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా..
- ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.101.19, డీజిల్ ధర రూ. 88.62
- ముంబయిలో పెట్రోల్ ధర రూ.107.26, డీజిల్ రూ. 96.19
- చెన్నైలో పెట్రోల్ ధర రూ.99.12, డీజిల్ ధర రూ. 93.40
- బెంగళూరులో పెట్రోల్ ధర రూ.104.70, డీజిల్ రూ. 94.04
- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.105.26, డీజిల్ రూ.96.69
- ఆదిలాబాద్‌లో పెట్రోల్ ధర రూ.107.50, డీజిల్ రూ. 98.77
- విజయవాడలో పెట్రోల్ రూ.107.41, డీజిల్ రూ. 98.32