సామాన్యుడికి పెట్రోలు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొద్ది రోజులు స్థిరంగా ఉన్న ఇంధన ధరలు ప్రస్తుతం పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా ఇంధన ధరలు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ పై 25-28 పైసలు, డీజిల్‌పై 30-33 పైసలకు వరకు పెరిగాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91.27, డీజిల్ రూ.81.73 కి పెరిగింది.
ప్రధాన నగరాల్లో నేడు ఇంధన ధరలు ఇలా..
ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.91.27, డీజిల్ రూ.81.73.
ముంబైలో పెట్రోల్ రూ.97.61, డీజిల్ రూ.88.82.
చెన్నైలో పెట్రోల్ రూ.93.15, డీజిల్ రూ.86.65.
కోల్‌కతాలో పెట్రోల్ రూ.91.41, డీజిల్ రూ.84.57.
బెంగళూరులో పెట్రోల్ రూ.94.30, డీజిల్ రూ.86.64.
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.94.86, డీజిల్ రూ.89.11.
జైపూర్‌లో పెట్రోల్ రూ.97.65, డీజిల్ రూ.90.25.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన పన్నులు విధిస్తుండటంతో పెట్రోల్, డీజిల్ ధరల్లో తేడాలు ఉంటాయి.