దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఈ నెలలో(మే) ఇప్పటికే 12 సార్లు ఇంధన ధరలను పెంచిన చమురు కంపెనీలు తాజాగా నేడు(ఆదివారం) కూడా లీటర్ పెట్రోల్‌పై 18 పైసలు, డీజిల్ పై 29 పైసలు పెంచాయి. కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.21 చేరగా.. డీజిల్ రూ.84.07కు చేరింది.
ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా..
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.21, డీజిల్ రూ.84.07
ముంబైలో పెట్రోల్ రూ.99.49, డీజిల్ రూ.91.30
చెన్నైలో పెట్రోల్ రూ.94.86 డీజిల్ రూ.88.87,
కోల్‌కతాలో పెట్రోల్ రూ.93.27, డీజిల్ రూ.86.91
హైదరాబాద్‌లో రూ.96.88, డీజిల్ రూ.91.65,
జైపూర్‌లో పెట్రోల్ రూ.99.68, డీజిల్ రూ.92.78
ఈ నెలలో మొత్తం 12 సార్లు పెంచగా.. పెట్రోల్‌పై దాదాపు రూ.2.81, డీజిల్‌పై రూ.3.34 మేర ధరలు పెరిగాయి. పెట్రోల్ రిటైల్ అమ్మకపు ధరలో 60 శాతం, డీజిల్‌లో 54 శాతానికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు విధిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ.32.90, డీజిల్‌పై రూ .11.80 వసూలు చేస్తోంది.
రోజువారీ సమీక్షలో భాగంగా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ ఉంటాయి. అయితే చమురు ఉత్పత్తులపై ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పన్నులు వసూలు చేస్తుండటంతో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎక్కువ తక్కువలు ఉంటాయి.