దేశంలో అలా ఎన్నికల పర్వం ముగిసిందో లేదో ఇటు పెట్రోలు ధరలు మళ్లీ పెరగడం మొదలయ్యాయి. ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే దేశీయ చమురు కంపెనీలు ధరలను పెంచుతూ వస్తున్నాయి. వరుసగా మూడో రోజు కూడా పెట్రో ధరలు పెరిగాయి. గురువారం నాడు లీటర్ పెట్రోల్ పై రూ.25పైసలు, డీజిల్ ధరపై రూ.30 పైసలు చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.99, డీజిల్ రూ.81.42కు చేరింది.
అంతర్జాతీయ మార్కెటులో ముడి చమురు ధరలు పెరగడంతో మూడో రోజు కూడా పెట్రో ధరలు పెంచామని చమురు సంస్థలు చెబుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో విధించే పన్నుల పై బట్టి పెట్రోల్, డీజిల్ ధరల్లో తేడాలు ఉంటాయి. అసలే కరోనా కష్టకాలంలో.. ఇలా పెట్రోల్ ధరలు పెరుగుతుండడంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.