ఎనిమిదో రోజు పెరిగిన ఇంధన ధరలు.. సెంచరీ దాటిన పెట్రోలు.. బ్యాట్, హెల్మెట్‌తో సామాన్యుడి నిరసన
Petrol hit century man poses with bat and helmet.దేశంలో ఇంధన ధరలు సామాన్యులకు షాకిస్తున్నాయి.సెంచరీ దాటిన పెట్రోలు..
By తోట వంశీ కుమార్ Published on 16 Feb 2021 5:01 AM GMTదేశంలో ఇంధన ధరలు సామాన్యులకు షాకిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల పెరుగుల కారణంగా దేశ వ్యాప్తంగా వరుసగా ఎనిమిదో రోజు కూడా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. రోజువారి సమీక్షలో భాగంగా లీటర్ పెట్రోల్‌నూ 38పైసలు, డీజిల్‌పై 39 పైసల మేర పెంచుతే చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 88.29 కి చేరగా.. డీజిల్ ధర రూ. 79.70 వద్ద నిలిచింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ. 95.75, డీజిల్ రూ. 86. 72 కి చేరాయి.
ఇక హైదరాబాద్‌లో పెట్రో ధర రికార్డు స్థాయికి చేరింది. లీటర్ పెట్రోల్ ధర రూ. 92.84గా ఉండగా.. డీజిల్ ధర రూ. 86.93కి చేరింది. ఏపీలోని విజయవాడ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.55 కాగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.02 గా ఉంది. అంతర్జాతీయ ధరలు. విదేశీ మారక ధరల ఆధారంగా దేశీయ చమురు సంస్థలు పెట్రోలు, డీజిల్ ధరలను రోజువారీగా సవరిస్తుంటాయి. అయితే.. వ్యాట్, ఇతర పన్నులతో వీటి ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి.
ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?
ఢిల్లీలో - పెట్రోల్ రూ. 88.29 - డీజిల్ ధర రూ. 79.70
ముంబైలో - పెట్రోల్ రూ. 95.75 - డీజిల్ రూ. 86.72
హైదరాబాద్‌లో - పెట్రోల్ రూ. 92.84 - డీజిల్ ధర రూ. 86.93
బెంగళూరులో - పెట్రోల్ రూ. 92.28 - డీజిల్ ధర రూ. 84.49
చెన్నైలో - పెట్రోల్ రూ. 91.45 - డీజిల్ ధర రూ. 84.77
బ్యాట్, హెల్మెట్‌తో సామాన్యుడి నిరసన..
బోపాల్‌లో తొలిసారి పెట్రోల్ ధర రూ.100 దాటేసింది. దీంతో.. ఓ వాహనదారుడు వినూత్నంగా నిరసన తెలిపాడు. క్రికెట్‌లో సెంచరీ తరువాత బ్యాట్స్‌మెన్ హెల్మెట్ తీసి తన ఆనందాన్ని వ్యక్తం చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే.. ఒక పెట్రోల్ పంప్ వద్ద ఓ వాహానదారుడు ఒక చేత్తో హెల్మెట్, మరో చేతితో బ్యాట్ ధరించి 'సెంచరీ' సంకేతమిచ్చాడు. అతను యువజన కాంగ్రెస్ ఆఫీస్ బ్యారర్ అని తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఇతర నగరాల్లోనూ ఇంధనం ధరలు సెంచరీ మార్క్ దాటేయడంపై వాహనదారులను తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కఠోర శ్రమ, పోరాటంతో ఎట్టకేలకు పెట్రోల్ సెంచరీ చేసింది' అంటూ ఒక ట్విట్టర్ యూజర్ భోపాల్ యువకుడి ఫోటోను షేర్ చేశాడు. పెట్రోల్ ప్రైజ్ అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చాడు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
After lot of hardwork and struggle finally !!
— Anmol Sharma (@sharrma_anmol) February 14, 2021
Century for Petrol !#PetrolPrice pic.twitter.com/acBD5Dxriq