మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పరుగుతు పెట్టాయి. దాదాపు 48 రోజుల పాటు నిలకడగా ప్రదర్శించిన పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వ చమురు రంగాలు తాజాగా ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 17 పైసలు, పెరిగి రూ.81.23కు చేరింది. ఇక డీజిల్ కూడా లీటర్‌పై 22 పైసలు పెరిగి ప్రస్తుతం రూ.70.68కు చేరింది.
ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 22పైసలు పెరిగి రూ.85.47కు చేరగా, డీజిల్ ధరలు 28 పైసలు పెరిగి రూ.77.12కు తాకినట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల్లో వివిధ పన్నులే 70 శాతం వరకు వాటాను ఆక్రమింస్తుంటాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా నాలుగు మెట్రోలో పెట్రోల్ , డీజిల్ ధరలు ... ముంబైలో పెట్రోల్ ధర రూ.87.92కు చేరగా, డీజిల్ రూ.77.11కు చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ.84.31 చేరగా, డీజిల్ రూ.76.17కు చేరింది. ఇక కోల్‌కతాలో పెట్రోల్ రూ.82.79 చేరగా, డీజిల్ రూ.74.24కు చేరింది. కాగా, దేశీయ మార్కెట్లో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రోల్ ఉత్పత్తుల ధరలను ఆయిల్ మార్కెట్ కంపెనీలు సవరించాయి. పెరిగిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది.