వాహనదారులకు షాకిస్తున్నాయి చమురు సంస్థలు. రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దిశగా కొనసాగుతోంది. ఇక గురువారం దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌పై 25 పైసల చొప్పున పెరిగింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.54 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.79.95గా ఉంది. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.96 ఉండగా, డీజిల్ రూ.86.98గా ఉంది.
ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.93.10గా ఉండగా, డీజిల్ రూ. 87.20 ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ రూ.92.83గా ఉండగా, డీజిల్ ధర రూ.86.94గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.78 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.83.54 ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.68, డీజిల్ ధర రూ.85.01 ఉంది.
ఇక ఏపీలోని విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.95.86 ఉండగా, డీజిల్ ధర రూ. 89.42 ఉంది. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.73 ఉండగా, డీజిల్ ధర రూ.88.83 ఉంది.