సామాన్యులకు వరుస షాకులు ఇస్తూనే ఉన్నాయి చమురు కంపెనీలు. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు, పోలింగ్ ఉండడంతో గత కొద్ది రోజులుగా ఇంధన ధరలు పెంచని కంపెనీలు.. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల ఫలితాలు వెలువడడంతో మళ్లీ సామాన్యుల నడ్డి విరిచేందుకు సిద్దం అయ్యాయి. 18 రోజుల విరామం అనంతరం నిన్న(మంగళవారం) తొలి సారి ఇంధన ధరలు పెరుగగా.. వరుసగా రెండో రోజు కూడా పెంచేశాయి. పెట్రోల్ లీటర్‌కు 19 పైసలు, డీజిల్‌పై లీటర్‌కు 21 పైసలు పెంచారు. పెంచిన ధరల ప్రకారం.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.12కి చేరగా.. డీజిల్ ధర రూ.81.12కు చేరుకుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి..
ఢిల్లీలో లీటరు పెట్రోలు - రూ.90.74, డీజిల్ - రూ.81.12
ముంబైలో లీటర్ పెట్రోల్ - రూ.97.12, డీజిల్ - రూ.88.19
చెన్నైలో లీటర్ పెట్రోల్ - రూ. 92.70, డీజిల్ - రూ.86.09
కోల్ కతాలో లీటర్ పెట్రోల్ - రూ.90.92, డీజిల్ - రూ.83.98
గతేడాది మార్చిలో కేంద్రం చమురుపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచినప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌పై రూ.21, డీజిల్ రూ.19పైగా పెరిగాయి. ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పెట్రోల్ ధర ఇప్పటికే రూ.100 దాటింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్ రూ.101కి చేరింది. గత కొంతకాలంగా చమురు ధరలు స్థిరంగా ఉండడం ఊపిరిపీల్చుకున్న వాహనదారులు మళ్లీ వరుసగా పెరుగుతూ వస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు.