పెట్రో బాదుడు.. వారంలో మూడోసారి
Petrol and Diesel prices raised by 80 paise a litre in Third hike this week.సామాన్యుడిపై పెట్రో భారం మొదలైంది.
By తోట వంశీ కుమార్ Published on 25 March 2022 2:30 AM GMT
సామాన్యుడిపై పెట్రో భారం మొదలైంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పటికి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా దాదాపు 137 రోజులు ఇంధన స్థిరంగా ఉన్నాయి. ఇక ఎన్నికలు ముగిసిన అనంతరం స్వల్ప వ్యవధిలోనే సామాన్యులకు షాకిస్తున్నాయి చమురు కంపెనీలు. వరుసగా రెండు రోజులు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగగా.. గురువారం కాస్త ఉపశమనాన్ని ఇచ్చాయి. అయితే.. శుక్రవారం మళ్లీ బాదుడు మొదలైంది. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 80పైసల చొప్పున వడ్డించాయి. మూడు రోజుల్లోనే లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.2.60పైగానే పెరిగాయి
తాజా పెంపుతో ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి.
- ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.97.81, డీజిల్ ధర రూ.89.07
- ముంబైలో పెట్రోల్ ధర రూ.112.51, డీజిల్ ధర రూ.96.70
- ముంబైలో పెట్రోల్ ధర రూ.112.51, డీజిల్ ధర రూ.96.70గా
- చెన్నైలో పెట్రోల్ ధర రూ.103.67, డీజిల్ ధర రూ.93.71,
- కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.34, డీజిల్ ధర రూ.91.42
- హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.110.91, డీజిల్ ధర రూ.97.23
- గుంటూరులో పెట్రోల్ ధర రూ.112.96, డీజిల్ ధర రూ.98.94
- విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.111.66, డీజిల్ ధర రూ. 97.68