స్థిరంగా పెట్రోల్.. పెరిగిన డీజిల్ ధర

Petrol and diesel prices on September 26.అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Sept 2021 1:10 PM IST
స్థిరంగా పెట్రోల్.. పెరిగిన డీజిల్ ధర

అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను స‌వ‌రిస్తుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఆదివారం లీట‌ర్ డీజిల్ ధ‌ర‌పై 27 పైస‌ల వ‌ర‌కు పెంచాయి చ‌మురు కంపెనీలు. అయితే.. పెట్రోల్ ధ‌ర‌పై ఎటువంటి మార్పులేక‌పోవ‌డం విశేషం. గ‌త 21 రోజులుగా పెట్రోల్ ధ‌ర స్థిరంగా ఉంది. తాజాగా పెంపుతో ముంబై న‌గ‌రంలో లీట‌ర్ డీజిల్ ధ‌ర 96.68కి చేరింది. ఢిల్లీలో 89.07, కోల్‌క‌తాలో రూ.89.07 న‌మోదు అయ్యాయి.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఇంధ‌న ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధ‌ర రూ.101.19, లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.89.07

- ముంబైలో పెట్రోల్ ధ‌ర రూ.107.26, డీజిల్ ధ‌ర రూ.96.68

- కోల్‌క‌తాలో పెట్రోల్ ధ‌ర రూ. 101.62. డీజిల్ ధర రూ. 92.17

- చెన్నైలో పెట్రోల్ ధ‌ర రూ.98.96, డీజిల్ ధ‌ర రూ.93.69,

- బెంగళూరులో పెట్రోల్ ధ‌ర రూ. 104.70. డీజిల్ ధర రూ. 94.53

-హైదరాబాద్‌లో పెట్రోల్ ధ‌ర రూ.105.26, డీజిల్ ధ‌ర రూ.97.35

- విజ‌య‌వాడ‌లో పెట్రోల్ ధ‌ర రూ.107.49, డీజిల్ ధ‌ర రూ.98.91

- విశాఖ‌ప‌ట్నంలో పెట్రోల్ ధ‌ర రూ.107.02, డీజిల్ ధ‌ర రూ.98.42

పెట్రోల్ ధర రూ.100 దాటిన నగరాల్లో ఢిల్లీ, కోల్‌కతా, భోపాల్, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురం, పాట్నా, భువనేశ్వర్ తదితర నగరాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికం. కేంద్రం పెట్రోల్ పైన రూ.32.90, డీజిల్ పైన రూ.31.80 వేస్తుంది. ఆయా రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు విధించే ప‌న్ను ఆధారంగా ఇంధ‌న ధ‌ర‌ల్లో ప్రాంతాల వారీగా మార్పులు ఉంటాయి.

Next Story