సామాన్యుడిపై పెట్రో భారం కొనసాగుతూనే ఉంది. వరుసగా నాలుగో రోజు ఇంధన ధరలు పెరిగాయి. శుక్రవారం కూడా లీటర్ పెట్రోల్ పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇంధన ధరలు పెరుగుతుండడంతో వీటి ప్రభావం నిత్యావసరాలపై పడుతోంది. దీంతో వాటి ధరలు కూడా కొండెక్కుతున్నాయి. తాజాగా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.54 చేరగా..డీజిల్ ధర రూ. 92.17కి చేరుకుంది.
ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా..
- ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.103.54, డీజిల్ ధర రూ.92.17
- ముంబైలో పెట్రోల్ ధర రూ.109.54, డీజిల్ ధర రూ.99.22
- కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.23, డీజిల్ ధర రూ.95.23
- చెన్నైలో పెట్రోల్ ధర రూ.101.01, డీజిల్ ధర రూ.96.60
- బెంగళూరులో పెట్రోల్ ధర రూ.107.14, డీజిల్ ధర రూ.97.70
- భువనేశ్వర్ లీటర్ పెట్రోల్ రూ. 104.98. లీటర్ డీజిల్ రూ. 97.85
- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.107.71, డీజిల్ ధర రూ.100.51
- జైపూర్ లీటర్ పెట్రోల్ రూ. 110.49 లీటర్ డీజిల్ రూ. 101.36