పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్నాళ్లు స్థిరంగా ఉన్న ధరలు ఇటీవల మళ్లీ పెరుగుతన్నాయి. దీంతో వాహనాలను భయటకు తీయాలంటే వాహనదారులు జంకుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తుంటాయన్న సంగతి తెలిసిందే. బుధవారం లీటరు పెట్రోలుపై 31 పైసలు, లీటరు డీజిల్‌పై 38 పైసలు చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.102.94, డీజిల్ రూ.91.45కి చేరింది.