ఇంధన ధరలు సామాన్యులకు చుక్కులు చూపిస్తున్నాయి. గత కొద్ది రోజులు ధరలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. దీంతో వాహనాలను భయటకు తీయాలంటే వాహనదారులకు జంకుతున్నారు. ఇంధన ధరలు పెరుగుతుండడంతో.. దీని ప్రభావం నిత్యావసరాలపై కూడా పడుతోంది. ఫలితంగా వాటి ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ధరలను సవరిస్తుంటాయన్న సంగతి తెలిసిందే. మంగళవారం లీటరు పెట్రోలుపై 29 పైసలు, లీటరు డీజిల్‌పై 32 పైసలు చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.102.64, డీజిల్ రూ.91.07కి చేరింది.
ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా..
- ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.102.64, డీజిల్ ధర రూ.91.07,
- ముంబైలో పెట్రోల్ ధర రూ.108.67, డీజిల్ ధర రూ.98.80,
- కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.103.36, డీజిల్ ధర రూ.94.17
- చెన్నైలో పెట్రోల్ ధర రూ.100.23, డీజిల్ ధర రూ.95.59
- బెంగళూరులో పెట్రోల్ ధర రూ.106.21, డీజిల్ ధర రూ.96.66
- లక్నోలో పెట్రోల్ ధర రూ. 99.54, డీజిల్ ధర రూ.91.33
- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.106.77, డీజిల్ ధర రూ.99.37.
- కరీంనగర్‌లో పెట్రోల్ ధర రూ.106.94, డీజిల్ ధర రూ.99.52
- ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 107.46, డీజిల్ ధర రూ. 99.98
- విజయవాడలో పెట్రోల్ ధర రూ.109.26, డీజిల్ ధర రూ.101.28