పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడి గుండెల్లో గుబులు రేపుతున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా ఇంధన ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఆదివారం లీటర్ పెట్రోల్ పై 25 పైసలు, డీజిల్పై 30 పైసలు మేర పెరిగింది. తాజాగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.39కి చేరగా.. డీజిల్ ధర రూ.90.77కి పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తుంటాయన్న సంగతి తెలిసిందే.
ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా..
- ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.102.39, డీజిల్ ధర రూ.90.77
- ముంబైలో పెట్రోల్ ధర రూ.108.43కు, డీజిల్ ధర రూ.98.48
- జైపూర్‌లో పెట్రోల్ ధర రూ.109.84, డీజిల్ రూ.100.50
- కోల్‌కతాలో పెట్రోల్ రూ.103.07, డీజిల్ రూ.93.87,
- చెన్నైలో పెట్రోల్ రూ.100.01, డీజిల్ రూ.95.31,
- బెంగళూరులో పెట్రోల్ రూ.105.95, డీజిల్ రూ.96.34
- లక్నోలో పెట్రోల్ రూ.99.48, డీజిల్ రూ.91.19
-హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.106.51, డీజిల్ ధర రూ.99.04