దేశంలో పెట్రో మంట కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో రోజు ఇంధన ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరుగుతున్న ధరలతో వాహనదారులు వాహనాలను బయటకు తీయాలంటేనే జంకుతున్నారు. ఇంధన ధరల పెరుగుదల నిత్యావసరాల ధరలపై కూడా పడుతుంది. ఫలితంగా వాటి ధరలు కూడా చుక్కలనంటుతున్నాయి. దీంతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. ఇంధన ధరలను తగ్గించాలంటూ గత కొద్ది రోజులుగా సామాన్య ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.
ఇక రోజువారి సమీక్షలో భాగంగా ఆదివారం కూడా ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 39 పైసలు మేర పెరిగింది. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.34పైసలకు చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.07 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా చమురు కంపెనీలు ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సమీక్షచేస్తుంటాయి.
ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా..
- ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.109.34, డీజిల్ ధర రూ.98.07
- ముంబైలో పెట్రోల్ ధర రూ.115.15, డీజిల్ ధర రూ.106.23