ఇంధన ధరల పెరుగుదలకు ఇప్పట్లో బ్రేకులు పడేలా లేవు. పెరుగుతున్న ధరలతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. వాహనదారులు వాహనాలను బయటకు తీయాలంటేనే జంకుతున్నారు. ఇంధన ధరల పెరుగుదల నిత్యావసరాలపై అధికంగా పడుతోంది. ఫలితంగా వాటి ధరలు కూడ కొండెక్కాయి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని గత కొద్ది రోజులుగా సామాన్య ప్రజలు ఎంత మొత్తుకున్నప్పటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఇక రోజువారి సమీక్షలో భాగంగా శుక్రవారం కూడా ఇంధన ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా లీటరు పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల చొప్పున వడ్డించాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.108.64కు చేరగా, డీజిల్ ధర రూ.97.37కు పెరిగింది.