ఇంధన ధర పెంపు ఇప్పట్లో ఆగేలా లేదు. ఓ వైపు నిత్యావసర ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతుండడం మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. అయినప్పటికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కనికరం చూపడం లేదు. తాజాగా మరోసారి ఇంధన ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. గురువారం లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, లీటరు డీజిల్ పై 38 పైసల చొప్పున వడ్డించాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.108.29, లీటర్ డీజిల్ ధర రూ.97.02కు చేరింది అంతర్జాతీయంగా దొరికే ముడి చమురు ధరల ఆధారంగా ప్రతిరోజు ఉదయం చమురు కంపెనీలు ఇంధన ధరను సవరిస్తుంటాయి.
ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా..
- ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.108.29, డీజిల్ ధర రూ.97.02
- ముంబైలో పెట్రోల్ ధర రూ.114.14, డీజిల్ ధర రూ.105.12
- చెన్నైలో పెట్రోల్ ధర రూ.105.13, డీజిల్ ధర రూ.101.25
- కోల్‌కతాలో ధర పెట్రోల్ రూ.108.78, డీజిల్ ధర రూ.100.14
-హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.112.64,డీజిల్ ధర రూ.105.84
- విజయవాడలో పెట్రోల్ ధర 114.48, డీజిల్ ధర 107