ఇంధన ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ రికార్డు స్థాయికి చేరాయి. తాజాగా మరోసారి ఇంధన ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. బుధవారం పెట్రోల్, డీజిల్ పై 35 పైసల చొప్పున పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర పెట్రోల్ ధర రూ.107.94కి చేరగా.. లీటరు డీజిల్ ధర రూ.96.67 కి పెరిగింది. అంతర్జాతీయంగా దొరికే ముడి చమురు ధరల ఆధారంగా ప్రతిరోజు చమురు కంపెనీలు ఇంధన ధరను సవరిస్తుంటాయి.
ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా..
- ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.107.94, డీజిల్ ధర రూ.96.67
- ముంబైలో పెట్రోల్ ధర రూ.113.80, డీజిల్ ధర రూ.104.75
- చెన్నైలో పెట్రోల్ ధర రూ.104.83, డీజిల్ ధర రూ.100.92
- కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.108.46, డీజిల్ ధర రూ.99.78
- బెంగళూరులో పెట్రోల్ ధర రూ.111.70, డీజిల్ ధర రూ.102.60
- జైపూర్‌లో పెట్రోల్ ధర రూ.115.44, డీజిల్ ధర రూ.106.68
-హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.112.27, డీజిల్ ధర రూ.105.46
- విజయవాడలో పెట్రోల్ ధర 114.48, డీజిల్ ధర రూ.107