బాదుడే బాదుడు.. మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌

Petrol and Diesel prices on October 22nd.ఇంధ‌న ధ‌రలు సామాన్యులకు చుక్క‌లు చూపిస్తున్నాయి. వ‌రుస‌గా మూడో రోజు కూడా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Oct 2021 3:24 AM GMT
బాదుడే బాదుడు.. మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌

ఇంధ‌న ధ‌రలు సామాన్యులకు చుక్క‌లు చూపిస్తున్నాయి. వ‌రుస‌గా మూడో రోజు కూడా ఇంధ‌న ధ‌ర‌ల‌ను చ‌మురు సంస్థ‌లు పెంచేశాయి. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు స‌రికొత్త రికార్డుల‌కు చేరాయి. వాహ‌నదారులు వాహ‌నాల‌ను బ‌య‌ట‌కు తీయాలంటేనే జంకుతున్నారు. పెరుగుతున్న ఇంధ‌న ధ‌ర‌ల ప్ర‌భావం నిత్యావ‌స‌రాల‌పై కూడా ప‌డుతోంది. గ‌త నెల‌తో పోలిస్తే నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు రెట్టింపు అయ్యాయి. శుక్ర‌వారం లీటర్ పెట్రోల్‌, డీజిల్‌పై మరో 35 పైసల చొప్పున పెంచేశాయి. తాజా పెంపుతో దేశ రాజ‌ధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.106.89కి చేరగా.. డీజిల్‌ ధర రూ.95.62కు పెరిగింది. అంత‌ర్జాతీయంగా ముడి చ‌మురు ధ‌ర‌ల ఆధారంగా ప్ర‌తి రోజు ఉద‌యం ఆరు గంట‌ల‌కు చ‌మురు కంపెనీలు ధ‌ర‌ల‌ను స‌వ‌రిస్తుంటాయి.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఇంధ‌న ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.89, డీజిల్ ధర రూ. 95.62

- ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.78, డీజిల్ ధర రూ. 103.63

- కోల్‌క‌తాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.45, డీజిల్ ధర రూ. 98.73

- చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.92, డీజిల్ ధర రూ. 99.92

- హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.18, డీజిల్ ధర రూ.104.32

- కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.35, డీజిల్ ధర రూ.104.47

- ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 111.26, డీజిల్ ధర రూ.104.37

- విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.90, డీజిల్‌ ధర రూ. 105.42

- గుంటూరులో లీటర్ పెట్రోల్ ధ‌ర రూ.113.76, డీజిల్ రూ.106.23

Next Story