కరోనా కష్టకాలం నుంచి ఇంకా కోలుకోక ముందే పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో వాహనాలను బయటకు తీయాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తుంటాయన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నేడు ఇంధన ధరలను మరోసారి పెంచాయి చమురు కంపెనీలు. శుక్రవారం లీటర్ పెట్రోల్‌పై 25పైసలు, డీజిల్‌పై 30పైసల చొప్పున వడ్డించాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.89కి చేరగా.. డీజిల్ ధర రూ.90.17కి పెరిగింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా..
- ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.101.89, డీజిల్ ధర రూ.90.17
- ముంబైలో పెట్రోల్ ధర రూ.107.95కు, డీజిల్ ధర రూ.97.84
- జైపూర్‌లో పెట్రోల్ ధర రూ.108.47, డీజిల్ రూ.99.08
- కోల్‌కతాలో పెట్రోల్ రూ.102.17, డీజిల్ రూ.92.97,
- చెన్నైలో పెట్రోల్ రూ.99.36, డీజిల్ రూ.94.45,
- బెంగళూరులో పెట్రోల్ రూ.105.44, డీజిల్ రూ.95.70
-హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.106, డీజిల్ ధర రూ.99.08