ఇంధన ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా ఆరో రోజు కూడా పెంచేశాయి చమురు కంపెనీలు. ఆదివారం లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పను భారం మోపాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.14, డీజిల్ ధర రూ.92.82కి చేరింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రతి రోజు ఉదయం ఇంధన ధరలను సవరిస్తుంటాయి చమురు కంపెనీలు. దేశంలోని అనేక ప్రాంతాల్లో పెట్రోల్ ధర ఎప్పుడో వంద దాటగా.. డీజిల్ ధర సైతం రూ.100 దాటింది. దీంతో వాహనదారులు వాహనాలను బయటకు తీయాలంటేనే జంకుతున్నారు.
ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా..
- ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.104.14, డీజిల్ ధర రూ.92.82
- ముంబైలో పెట్రోల్ ధర రూ.110.12, డీజిల్ ధర రూ.100.66