పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల్లో ఎంతెంత తగ్గాయంటే..?

Petrol and Diesel prices on November 4th.దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం వాహ‌న‌దారుల‌కు తీపి క‌బురు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Nov 2021 12:49 PM IST
పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల్లో ఎంతెంత తగ్గాయంటే..?

దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం వాహ‌న‌దారుల‌కు తీపి క‌బురు చెప్పింది. అంత‌ర్జాతీయ మార్కెట్ ధ‌ర‌లు పెరుగుతున్న త‌రుణంలో ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. లీటరు పెట్రోల్ పై రూ.5, లీటరు డీజిల్ పై రూ. 10చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని త‌గ్గింది. ఈ త‌గ్గించిన ధ‌ర‌లు నేటి నుంచే అమ‌ల్లోకి వ‌చ్చాయి. కేంద్ర ప్ర‌భుత్వం ఎక్సైజ్ సుంకాన్ని త‌గ్గించిన కొన్ని గంట‌ల్లోనే బీజేపీ అధికారంలో ఉన్న తొమ్మిది రాష్ట్రాల్లో కూడా పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌పై ప‌న్నుల‌ను స్వ‌ల్పంగా త‌గ్గించాయి. అస్సాం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ధ‌ర‌లు త‌గ్గించాయి.

- ఢిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.6.07, డీజిల్ ధర లీటర్​ రూ.11.73 తగ్గింది. దీనితో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్​కు వరుసగా రూ.104.01, రూ.86.71కి చేరాయి.

- చెన్నైలో పెట్రోల్ ధర లీటర్​ రూ.5.27 తగ్గి రూ.101.38 వద్ద ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.11.15 తగ్గి రూ.91.42 వద్దకు చేరింది.

- బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్​ రూ.6.29 తగ్గి రూ.107.62 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర రూ.12.45 తగ్గి రూ.92.02 వద్దకు చేరింది.

- ముంబయిలో పెట్రోల్ ధర లీటర్​ రూ.5.87 తగ్గి రూ.109.96 వద్దకు చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.12.46 దిగొచ్చి రూ.94.13 వద్ద కొనసాగుతోంది.

- కోల్​కతాలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా లీటర్​కు రూ.5.82, రూ.11.75 పైసల చొప్పున తగ్గాయి. దీనితో లీటర్​ పెట్రోల్ ధర రూ.104.65 వద్దకు చేరింది. డీజిల్ ధర లీటర్​ రూ.89.78 వద్ద కొనసాగుతోంది.

- హైదరాబాద్ నగరంలో పెట్రోల్ లీటర్ ధర రూ. 6.33 తగ్గి రూ. 108.18గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 12.79 తగ్గి రూ. 94.61గా ఉంది.

- ఆంధ్రప్రదేశ్‌లో అమరావతిలో లీటరు పెట్రోల్ ధర రూ.110.67కు, డీజిల్ ధర రూ.96.08కు తగ్గింది.

Next Story