ఒక్క రోజే ఊర‌ట‌.. వాహ‌న‌దారుల‌కు మ‌ళ్లీ షాకిచ్చిన చ‌మురు కంపెనీలు

Petrol and Diesel Prices Increased Today. గురువారం మాత్రం పెర‌గ‌క‌పోవ‌డంతో కాస్త ఊపిరి పీల్చుకున్న వాహాన‌దారుల‌కు శుక్ర‌వారం మ‌ళ్లీ షాకిచ్చాయి చ‌మురు కంపెనీలు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 May 2021 9:07 AM IST
fuel prices hike

ఓ వైపు క‌రోనా విజృంభిస్తుండ‌డం.. మ‌రో వైపు ఇంధ‌న ధ‌ర‌లు పెరుగుతుండ‌డంతో సామాన్యుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. బుధ‌వారం వ‌ర‌కు ఇంధ‌న పెరుగుతూ వ‌చ్చాయి. అయితే.. గురువారం మాత్రం పెర‌గ‌క‌పోవ‌డంతో కాస్త ఊపిరి పీల్చుకున్న వాహాన‌దారుల‌కు శుక్ర‌వారం మ‌ళ్లీ షాకిచ్చాయి చ‌మురు కంపెనీలు. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.29 పైసలు, డీజిల్‌పై రూ.34 పైసలు పెరిగాయి. తాజా పెంపుతో ఇంధ‌న ధ‌ర‌లు రికార్డు స్థాయికి చేరాయి. కాగా.. ఈ నెల‌లో 14 రోజుల్లో 8 రోజులు ఇంధ‌న ధ‌ర‌లు పెరిగాయి. 8 రోజుల్లో మొత్తంగా పెట్రోల్‌పై రూ.1.94, డీజిల్‌పై రూ.2.22 పెరిగింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఇంధ‌న ధ‌ర‌లు ఇలా..

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.92.34, డీజిల్‌ రూ.82.95

ముంబైలో పెట్రోల్‌ రూ.93.36, డీజిల్‌, రూ.89.75,

చెన్నైలో రూ.93.84, డీజిల్‌ రూ.87.49,

కోల్‌కతాలో రూ.92.16, డీజిల్‌ రూ.85.45,

హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.95.97, డీజిల్ రూ.90.43‌,

జైపూర్‌లో రూ.99.02, డీజిల్‌ రూ.91.80



Next Story