పెట్రోమంట‌.. వ‌రుస‌గా రెండో రోజు పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు

Petrol and diesel prices hiked again for 2nd straight day.ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియ‌డంతో మ‌ళ్లీ పెట్రోలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 March 2022 8:07 AM IST
పెట్రోమంట‌.. వ‌రుస‌గా రెండో రోజు పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియ‌డంతో మ‌ళ్లీ పెట్రోలు ధ‌ర‌లు పెరిగిపోతున్నాయి. వ‌రుస‌గా రెండో రోజూ దేశ వ్యాప్తంగా పెట్రో, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచాయి చ‌మురు కంపెనీలు. బుధ‌వారం లీట‌ర్ పెట్రోల్ పై 90 పైస‌లు, లీట‌ర్ డీజిల్ పై 87 పైస‌లు చొప్పున పెంచాయి. తాజా పెంపుతో హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.110కి చేర‌గా.. డీజిల్ ధర రూ.96.36కి పెరిగింది. మ‌రో తెలుగు రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో లీట‌ర్ పెట్రోల్‌పై 87 పైస‌లు, డీజిల్‌పై 84 పైస‌లు పెరిగింది. దీంతో గుంటూరులో లీట‌ర్ పెట్రోల్ రూ.112.08, డీజిల్ రూ.98.10కి చేరుకుంది.

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97,01 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.27కు పెరిగింది. ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.111.58 ఉండగా.. డీజిల్‌ ధర రూ.95.74 ఉంది. అలాగే చెన్నైలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.102.96 ఉండగా.. డీజిల్‌ ధర రూ.92.99 ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.31 ఉండగా, డీజిల్‌ ధర రూ.91.42 వద్ద కొనసాగుతోంది. అంత‌ర్జాతీయంగా బ్యారెల్ ముడి చ‌మురు ధ‌ర‌ల ఆధారంగా ప్ర‌తి రోజు ఉద‌యం ఆరు గంట‌ల‌కు చ‌మురు కంపెనీలు ధ‌ర‌ల‌ను స‌వ‌రిస్తుంటాయి అన్న సంగ‌తి తెలిసిందే.

Next Story