త‌గ్గేదేలే.. మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు

Petrol and Diesel Prices Hiked Again Fifth Time In 6 Days.దేశ వ్యాప్తంగా సామాన్యులపై పెట్రోల్‌, డీజిల్‌ వాత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 March 2022 3:41 AM GMT
త‌గ్గేదేలే.. మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు

దేశ వ్యాప్తంగా సామాన్యులపై పెట్రోల్‌, డీజిల్‌ వాత కొనసాగుతోంది. ఆరు రోజుల్లో ఐదో సారి చమురు సంస్థలు ధరలను పెంచాయి. ఆదివారం దేశ వ్యాప్తంగా లీటర్‌ పెట్రోల్‌ పై 50పైసలు, డీజిల్‌పై 55పైసలు పెరిగింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్‌ ధర రూ.99.11, డీజిల్‌ ధర రూ.90.42

- ముంబైలో పెట్రోల్‌ ధర రూ.113.88, డీజిల్‌ ధర రూ.98.13

- చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.104.90, డీజిల్‌ ధర రూ.95.00

- కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ.108.53, డీజిల్‌ ధర రూ.93.57

- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.112.35, డీజిల్ ధర రూ.98.68

- విశాఖ‌ప‌ట్నంలో పెట్రోల్ ధర రూ.113.08, డీజిల్ ధర రూ.99.09

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల కార‌ణంగా సుమారు 137 రోజుల పాటు ఇంధ‌న ధ‌ర‌ల‌ను పెంచ‌లేదు. ప్రముఖ ఇన్వెస్టర్‌ సర్వీస్‌ సంస్థ మూడిస్‌ ప్రకారం ఈ స‌మ‌యంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ పెట్రోల్‌ కార్పొరేషన్‌ సంస్థలకు దాదాపు రూ.19వేల కోట్ల న‌ష్టం వాటిన‌ట్లు తెలిపింది. అదే సమయంలో బ్యారెల్‌ చమురు ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ క్ర‌మంలో న‌ష్టాల‌ను త‌గ్గించుకునేందుకు పెంపు అనివార్యం అయిన‌ట్లు మూడిస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ తన నివేదికలో వెల్ల‌డించింది.

Next Story