వాహనదారులకు గుడ్‌న్యూస్.. దిగొస్తున్న పెట్రోల్ ధర
Petrol and diesel prices get cheaper.ఇటీవల కాలంలో ఇంధన పెరుగుతుండడంతో వాహనదారులు తమ వాహనాలను
By తోట వంశీ కుమార్ Published on 24 Aug 2021 10:02 AM ISTఇటీవల కాలంలో ఇంధన పెరుగుతుండడంతో వాహనదారులు తమ వాహనాలను బయటకు తీయాలంటేనే జంకుతున్నారు. చమురు కంపెనీలు వాహనదారులకు కాస్త ఊరట నిచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించాయి. మంగళవారం పెట్రోల్ ధరపై రూ.15పైసలు, డీజిల్ ధరపై రూ.15 పైసలు తగ్గించాయి. మే, జూలై మధ్య 42 రోజుల పాటు ధరల్లో పెరుగుదల నమోదవగా.. లీటర్‌పై రూ.11.52, డీజిల్‌పై 41 రోజుల్లో లీటర్‌పై 9.08 వరకు పెరిగింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా హర్దీప్ సింగ్ పూరి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ధరలు జూలై 18 నుంచి స్థిరంగా కొనసాగుతూ వచ్చాయి. ఈ నెల 22న పెట్రోల్ ధరపై 20 పైసలు తగ్గగా.. తాజాగా మరోసారి 15 పైసలు వరకు తగ్గింది.
ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా..
- ఢిల్లీలో పెట్రోల్ రూ.101.49, డీజిల్ రూ.88.92
- ముంబైలో పెట్రోల్ రూ.107.52, డీజిల్ రూ.96.48
- చెన్నైలో పెట్రోల్ రూ.99.20, డీజిల్ రూ.93.52
- కోల్‌కతాలో పెట్రోల్ రూ. 101.82, డీజిల్ రూ.91.98
- భోపాల్‌లో పెట్రోల్ రూ.109.91, డీజిల్ రూ.97.72
- రాంచీలో పెట్రోల్ రూ.96.47, డీజిల్ రూ.93.86
- బెంగళూరులో పెట్రోల్ రూ.104.98, డీజిల్ 94.34
- పాట్నాలో పెట్రోల్ రూ.103.99, డీజిల్ రూ.94.75
- చండీగఢ్‌లో పెట్రోల్ రూ.97.66, డీజిల్ రూ.88.62
- లక్నోలో పెట్రోల్ రూ.98.56, డీజిల్ రూ.89.29
- హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.105.54, డీజిల్ రూ.96.99