మ‌ళ్లీ పెరిగిన ఇంధ‌న ధ‌ర‌లు.. ముంబైలో సెంచ‌రీ దాటిన పెట్రోల్‌

Petrol and diesel price on may 29th.ఓ వైపు క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తుంటే.. మ‌రోవైపు చ‌మురు కంపెనీలు ఇంధ‌న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 May 2021 3:34 AM GMT
మ‌ళ్లీ పెరిగిన ఇంధ‌న ధ‌ర‌లు.. ముంబైలో సెంచ‌రీ దాటిన పెట్రోల్‌

ఓ వైపు క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తుంటే.. మ‌రోవైపు చ‌మురు కంపెనీలు ఇంధ‌న ధ‌ర‌లు పెంచుతుండ‌డంతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. తాజాగా లీటర్ పెట్రోల్ పై 28 పైస‌లు, లీట‌ర్ డీజిల్ పై 26 పెంచుతూ చ‌మురు కంపెనీలు నిర్ణ‌యం తీసుకున్నాయి. ఇప్ప‌టికే దేశంలోని ప‌లు ప్రాంతాల్లో పెట్రోల్ ధ‌ర రూ.100దాట‌గా.. శ‌నివారం పెంచిన ధ‌ర‌తో దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో కూడా పెట్రోల్ ధ‌ర శ‌త‌కం దాటింది. ప్ర‌స్తుతం ముంబైలో పెట్రోల్ ధ‌ర రూ.100.19 ఉండ‌గా.. డీజిల్ రూ.92.17కి చేరింది. ఈ నెల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 16 సార్లు ధ‌ర‌లు పెరుగ‌గా.. లీట‌ర్ పెట్రోల్ పై రూ.3.61, డీజిల్ పై రూ.4.11 పెరిగింది.

ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.93.94, డీజిల్‌ 84.89

ముంబైలో పెట్రోల్‌ రూ.100.19, డీజిల్‌ రూ.92.17

చెన్నైలో పెట్రోల్‌ రూ.95.51, డీజిల్‌ రూ.89.65

కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.93.97, డీజిల్‌ రూ.87.74

బెంగళూరులో పెట్రోల్‌ రూ.97.07, డీజిల్‌ రూ.89.99

భోపాల్‌లో పెట్రోల్‌ రూ.102.04, డీజిల్‌ 93.37

రాంచీలో పెట్రోల్‌ రూ.90.62, డీజిల్‌ రూ.89.64

పాట్నాలో పెట్రోల్‌ రూ.96.10, డీజిల్‌ రూ.90.16

చండీగఢ్‌లో పెట్రోల్‌ రూ.90.36, డీజిల్‌ రూ.84.55

లక్నోలో పెట్రోల్‌ రూ.91.41, డీజిల్‌ రూ.85.28

హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.97.63, డీజి‌ల్‌ రూ.92.54


Next Story