పెట్రో మంట ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. సామాన్యులపై ఏ మాత్రం కనికరం లేకుండా ఇంధన ధరలను పెంచుకుంటూ పోతున్నాయి చమురు సంస్థలు. మార్చి 22 నుంచి ప్రారంభమైన ధరల పెంపు గత పదిరోజుల్లో తొమ్మిది సార్లు పెరిగింది. తాజాగా గురువారం లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు చొప్పున పెంచాయి చమురు కంపెనీలు. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ101.81 చేరగా.. డీజిల్ ధర రూ.93.07 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.40, డీజిల్ ధర రూ.101.56 కు చేరింది.
ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
- ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.101.81, డీజిల్ ధర రూ. 93.07
- ముంబైలో పెట్రోల్ ధర రూ. 116.72, డీజిల్ ధర రూ. 100.94
- చెన్నైలో పెట్రోల్ ధర రూ. 107.45, డీజిల్ ధర రూ. 97.52
- కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 111.35, డీజిల్ ధర రూ. 96.22
- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 115.42, డీజిల్ ధర రూ. 101.58
- విజయవాడలో పెట్రోల్ ధర రూ. 116.17, డీజిల్ ధర రూ.103
- గుంటూరులో పెట్రోల్ ధర రూ. 117.32, డీజిల్ ధర రూ.103.10
మీ ప్రాంతంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత ఉన్నాయో ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ రేట్లు తెలుసుకోవాలంటే మీరు మీ ఫోన్ నుంచి 9224992249 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. మీరు హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ రేట్లు తెలుసుకోవాలంటే RSP 134483 అని టైప్ చేసి 9224992249 ఫోన్ నెంబర్‌కు మెసేజ్ పంపితే.. నేటి ధరలు తెలుసుకోవచ్చు.