పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో వాహనదారులు వాహనాలను బయటకు తీయాలంటేనే జంకుతున్నారు. నేడు(బుధవారం) లీటర్ పెట్రోల్, డీజిల్ పై 90 పైసలు చొప్పున పెంచాయి చమురు కంపెనీలు. దీంతో గత తొమ్మిది రోజుల్లో ఎనిమిది సార్లు ఇంధన ధరలు పెరిగాయి. మొత్తంగా తొమ్మిది రోజుల్లో లీటర్ పెట్రోల్ పై రూ.5.60 పెంచాయి. పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు.
ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
- ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.101.01, డీజిల్ ధర రూ. 92.27
- ముంబైలో పెట్రోల్ ధర రూ. 115.88, డీజిల్ ధర రూ. 100.10,
- చెన్నైలో పెట్రోల్ ధర రూ. 106.69, డీజిల్ ధర రూ. 96.76,
- కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 110.52, డీజిల్ ధర రూ. 95.42,
- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 114.51, డీజిల్ ధర రూ. 100.70
- విజయవాడలో పెట్రోల్ ధర రూ. 116.27, డీజిల్ ధర రూ.102.13
- గుంటూరులో పెట్రోల్ ధర రూ. 116.45, డీజిల్ ధర రూ.102.27
మీ ప్రాంతంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత ఉన్నాయో ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ రేట్లు తెలుసుకోవాలంటే మీరు మీ ఫోన్ నుంచి 9224992249 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. మీరు హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ రేట్లు తెలుసుకోవాలంటే RSP 134483 అని టైప్ చేసి 9224992249 ఫోన్ నెంబర్‌కు మెసేజ్ పంపితే.. నేటి ధరలు తెలుసుకోవచ్చు.