భ‌గ్గుమంటున్న ఇంధ‌న ధ‌ర‌లు.. మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol and Diesel price on March 29th.దేశ వ్యాప్తంగా ఇంధ‌న ధ‌ర‌ల పెంపు కొన‌సాగుతోంది. నేడు కూడా పెట్రోల్‌, డీజిల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 March 2022 3:00 AM GMT
భ‌గ్గుమంటున్న ఇంధ‌న ధ‌ర‌లు.. మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశ వ్యాప్తంగా ఇంధ‌న ధ‌ర‌ల పెంపు కొన‌సాగుతోంది. నేడు కూడా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచాయి చ‌మురు కంపెనీలు. నిత్యం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌తో వాహ‌నాల‌ను బ‌య‌ట‌కు తీయాలంటేనే వాహ‌న‌దారులు జంకుతున్నారు. గ‌డిచిన ఎనిమిది రోజుల్లో ఏడుసార్లు చ‌మురు ధ‌ర‌ల‌ను పెంచారు. నేడు(మంగ‌ళ‌వారం) లీట‌ర్ పెట్రోల్ పై 90 పైస‌లు, డీజిల్ పై 76 పైస‌లు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నాయి చ‌మురు కంపెనీలు. తాజా పెంపుతో దేశ రాజ‌ధాని ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 100.21 చేర‌గా.. డీజిల్ ధ‌ర రూ. 91.47 వ‌ద్ద కొన‌సాగుతోంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో పెట్రోల్ ధ‌ర రూ.100.21, డీజిల్ ధ‌ర రూ. 91.47

- ముంబైలో పెట్రోల్ ధ‌ర రూ. 115.04, డీజిల్ ధ‌ర రూ. 99.25,

- చెన్నైలో పెట్రోల్ ధ‌ర రూ. 105.94, డీజిల్ ధ‌ర రూ. 96,

- కోల్‌క‌తాలో పెట్రోల్ ధ‌ర రూ. 109.68, డీజిల్ ధ‌ర రూ. 94.62,

- హైదరాబాద్‌లో పెట్రోల్ ధ‌ర రూ. 113.61, డీజిల్ ధ‌ర రూ. 99.83

- విజ‌య‌వాడ‌లో పెట్రోల్ ధ‌ర రూ. 115.37, డీజిల్ ధ‌ర రూ.101.23

మీ ప్రాంతంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఎంత ఉన్నాయో ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. ఇండియన్ ఆయిల్ రేట్లు తెలుసుకోవాలంటే మీరు మీ ఫోన్ నుంచి 9224992249 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. మీరు హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ రేట్లు తెలుసుకోవాలంటే RSP 134483 అని టైప్ చేసి 9224992249 ఫోన్ నెంబర్‌కు మెసేజ్ పంపితే.. నేటి ధ‌ర‌లు తెలుసుకోవ‌చ్చు.

Next Story