బాదుడే బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol and diesel price on june16th.ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం నుంచి ప్రారంభమైన ఇంధన పెంపు కొనసాగుతోంది.
By తోట వంశీ కుమార్ Published on 16 Jun 2021 7:32 AM ISTఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం నుంచి ప్రారంభమైన ఇంధన పెంపు కొనసాగుతోంది. పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యులకు చుక్కులు చూపిస్తున్నాయి. బుధవారం మరోసారి లీటర్ పెట్రోల్ పై 25 పైసలు, డీజిల్‌పై 15 పైసలు పెంచేశాయి చమురు కంపెనీలు. కొత్తగా పెంచిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.66కు చేరగా డీజిల్ రూ.87.41కు పెరిగింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో లీటర్ పెట్రోల్ రూ.100 మార్క్‌ను దాటింది. డీజిల్ సైతం రూ.100 వైపు పరుగులు పెడుతోంది. ఆసిఫాబాద్‌లో పెట్రోల్ రూ.102.08, డీజిల్ రూ.96.78కు చేరింది.
ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు..
- ఢిల్లీలో పెట్రోల్ రూ.96.66, డీజిల్ రూ.87.41
- ముంబై పెట్రోల్ రూ.102.82, డీజిల్ రూ.94.84
- బెంగళూరులో రూ.99.89, డీజిల్ రూ.92.66
- పాట్నాలో రూ.98.73, డీజిల్ రూ.92.72
- చండీగఢ్‌లో రూ.92.96, డీజిల్ రూ.87.05
- లక్నోలో పెట్రోల్ రూ.93.88, డీజిల్ రూ.87.81
- చెన్నైలో పెట్రోల్ రూ.97.91, డీజిల్ రూ.94.04
- కోల్‌కతాలో రూ.96.58, డీజిల్ రూ.90.25
- భోపాల్‌లో రూ.104.85, డీజిల్ రూ.96.05
- రాంచీలో పెట్రోల్ రూ.92.70, డీజిల్ రూ.92.27
- హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.100.46, డీజిల్ రూ.95.28
- విజయవాడలో పెట్రోల్ రూ.102.42, డీజిల్ రూ.96.67
మే 4 నుంచి ఇప్పటి వరకు ఇంధన ధరలు 26వసార్లు పెరిగాయి. పెట్రోల్‌పై రూ.6.34, డీజిల్‌పై రూ.6.63 వరకు పెరిగింది. దేశంలో అత్యధికంగా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్ పెట్రోల్‌రూ.107.79, లీటర్ డీజిల్‌రూ.100.51కు పెరిగింది.