చుక్క‌లు చూపిస్తున్న ఇంధ‌న ధ‌ర‌లు

Petrol and diesel price on june15th.పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు మంగ‌ళ‌వారం మార‌లేదు. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Jun 2021 9:10 AM IST
చుక్క‌లు చూపిస్తున్న ఇంధ‌న ధ‌ర‌లు

పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు మంగ‌ళ‌వారం మార‌లేదు. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల అనంత‌రం పెట్రోల్ ధ‌ర‌ల పెంపు ప్రారంభమైంది. సోమ‌వారం లీటర్‌ పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 31 పైసలకు పెరిగింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాలతో పాటు ప‌లు ప్రాంతాల్లోనూ లీటర్ పెట్రోల్‌ ధర రూ.100 మార్క్‌ను దాటింది. మరో వైపు డీజిల్ కూడా రూ.100 వైపు వేగంగా పరుగులు పెడుతున్నది. ఢిల్లీలో మంగళవారం లీటర్ పెట్రోల్ ధర రూ.97కి ద‌గ్గ‌ర‌గా ఉండ‌గా.. హైద‌రాబాద్‌లో మాత్రం రూ.100 మార్క్‌ను దాటింది.

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.20 గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 95.14గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.34 గా ఉండగా లీటర్ డీజిల్ ధర ధర రూ.95.26గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 100.80గా ఉండగా డీజిల్ ధర రూ. 95.68గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.77గా ఉండగా డీజిల్ ధర రూ.95.65గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.30ఉండగా డీజిల్ ధర రూ.95.24 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.91పలుకుతుండగా లీటర్ డీజిల్ ధర రూ. 94.85గా ఉంది.

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 102.56కు లభిస్తుండగా లీటర్ డీజిల్ ధర రూ. 96.87 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 101.35 ఉండగా డీజిల్ ధర రూ.95.72గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.47లకు లభిస్తుండగా డీజిల్ ధర రూ.96.72 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.78 గా ఉండగా డీజిల్ ధర రూ.97.10గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 102.56 లకు లభిస్తుండగా డీజిల్ రూ.96.87 లకు లభిస్తోంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో పెట్రోల్‌ రూ.రూ.96.41, డీజిల్ ధర రూ.87.28

- ముంబైలో పెట్రోల్ రూ.102.58, డీజిల్ రూ.94.70

- కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.96.34, డీజిల్ రూ.90.12

- చెన్నైలో పెట్రోల్‌ రూ.97.69, డీజిల్ రూ.91.92

- పాట్నాలో పెట్రోల్ రూ.98.49, డీజిల్ రూ.92.59

- లక్నోలో పెట్రోల్ రూ.93.40, డీజిల్ రూ.87.47

Next Story