హైదరాబాద్‌లో రూ.100 మార్క్ దాటిన పెట్రోల్
Petrol and Diesel price on june14th.ఆకాశమే హద్దుగా ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి. ఐదు రాష్ట్రాల
By తోట వంశీ కుమార్ Published on 14 Jun 2021 4:06 AM GMTఆకాశమే హద్దుగా ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మొదలైన పెంపు ఇంకా కొనసాగుతోంది. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 31 పైసలకు పెరిగింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాలతో పాటు పలు ప్రాంతాల్లోనూ లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్‌ను దాటింది. మరో వైపు డీజిల్ కూడా రూ.100 వైపు వేగంగా పరుగులు పెడుతున్నది. తాజాగా పెంచిన ధరలతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్‌ను దాటింది. ప్రస్తతం లీటర్ పెట్రోల్ ధర రూ.100.20కు చేరగా.. డీజిల్ లీటర్ రూ.95.14కు పెరిగింది. ఐదారు జిల్లాలు మినహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగతా అన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ రూ.100 దాటింది. అత్యధికంగా ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పెట్రోల్ రూ.102కుపైగా ధర పలుకుతుండగా.. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నిర్మల్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరితో పాటు పలు జిల్లాల్లో లీటర్ పెట్రోల్ రూ.100 దాటింది.
ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
- ఢిల్లీలో పెట్రోల్ రూ.రూ.96.41, డీజిల్ ధర రూ.87.28
- ముంబైలో పెట్రోల్ రూ.102.58, డీజిల్ రూ.94.70
- కోల్‌కతాలో పెట్రోల్ రూ.96.34, డీజిల్ రూ.90.12
- చెన్నైలో పెట్రోల్ రూ.97.69, డీజిల్ రూ.91.92-
- పాట్నాలో పెట్రోల్ రూ.98.49, డీజిల్ రూ.92.59
- లక్నోలో పెట్రోల్ రూ.93.40, డీజిల్ రూ.87.47
- హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.100.20, డీజిల్ రూ.95.14