వాహనదారులకు చమురు కంపెనీలు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నాయి. కరోనా కష్టకాలంలోనూ సామ్యానులపై కనికరం చూపకుండా వారి జేబులు గుల్ల చేస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర వంద దాటింది. తాజాగా పెట్రోల్‌పై 27 పైసలు, డీజిల్ పై 28 పైసలు చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఈ నెలలో(జూన్‌లో) ఐదోసారి ధరలు పెంచినట్లు అయ్యింది. పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.56కి చేరగా.. డీజిల్ ధర రూ.86.47కి చేరింది.
ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
- ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.56, లీటర్ డీజిల్ ధర రూ. 86.47
- ముంబైలో పెట్రోల్ రూ.101.76, డీజిల్ రూ.93.85
- చెన్నైలో పెట్రోల్ ధర రూ.96.94, డీజిల్ రూ.96.94
- కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.95.52, డీజిల్ రూ.89.32
-హైదరాబాద్‌లో పెట్రోల్ ధర.99.32, డీజిల్ రూ.94.26
- విజయవాడలో పెట్రోల్ ధర రూ.101.55, డీజిల్ రూ. 95.90
- విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.99.69, డీజీల్ రూ.94.03
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఇప్పటి వరకు 22 సార్లు ఇంధనలు పెరిగాయి. వరుసగా పెరుగుతూ వస్తున్న ధరలతో సామాన్యులు పెట్రోల్ బంకుకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.