ఆగని పెట్రో బాదుడు
Petrol and Diesel price on June 27th.దేశంలో పెట్రోల్ ధరలు సెంచరీ దాటిన పరుగులు మాత్రం ఆగడం లేదు.
By తోట వంశీ కుమార్ Published on 27 Jun 2021 10:45 AM IST
దేశంలో పెట్రోల్ ధరలు సెంచరీ దాటిన పరుగులు మాత్రం ఆగడం లేదు. శనివారం లీటర్ పెట్రోల్ పై రూ. 35 పైసలు, డీజిల్‌పై రూ. 37 పైసలు పెంచిన చమురు కంపెనీలు.. నేడు (ఆదివారం) పెట్రోల్, డీజల్‌పై వరుసగా రూ.36 పైసలు, రూ.26 పైసల మేర పెంచాయి. తాజాగా పెంచిన ధరలతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ రూ.98.47 ఉండగా, డీజిల్ ధర రూ.88.91కి చేరింది. మే 4 తేదీ నుంచి ఇప్పటి వరకు పెట్రోల్ ధరలు దాదాపు 31 సార్లు పెరిగాయి.
ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
- ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.47, డీజిల్ ధర రూ.88.91
- చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.49, డీజిల్ ధర 93.46
- ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.56, డీజిల్ ధర రూ. 96.42
- బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.75, డీజిల్ రూ. 94.25
- హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.102.32, డీజిల్ ధర రూ. 96.90
మన తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల లీటరు పెట్రోలు ధరలు రూ.105 పైనే ఉన్నాయి. శనివారం చిత్తూరు జిల్లా కుప్పంలో లీటరు డీజిల్ రూ.100.07 కాగా ఇక్కడ పెట్రోలు ధర రూ.106.25కి చేరింది. ఇక్కడే కాదు.. పలు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ పెట్రోలు ధర రూ.105 దాటేయగా.. డీజిల్ రూ.100కి చేరువగా వచ్చింది.