సామాన్యుడిపై పెరుగుతున్న భారం.. మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర
Petrol and Diesel price on June 26th.కరోనా నుంచి పూర్తిగా కోలుకోక ముందే ఓ వైపు డెల్టా ఫ్లస్ వైరస్ లు భయపెడుతుంటే..
By తోట వంశీ కుమార్ Published on 26 Jun 2021 8:00 AM ISTకరోనా నుంచి పూర్తిగా కోలుకోక ముందే ఓ వైపు డెల్టా ఫ్లస్ వైరస్ లు భయపెడుతుంటే.. మరో వైపు పెరుగుతున్న ఇంధన ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. పెట్రోల్, డిజీల్ ధరలు పెరుగుతుండడంతో వాహనదారులు వాహనాలు బయటికి తీయాలంటేనే జంకుతున్నారు. తాజాగా శనివారం లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు, లీటర్ డీజిల్ పై 37 వరకు పెంచాయి చమురు కంపెనీలు. తాజాగా పెంచిన ధరలతో డిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.11కి చేరగా.. డీజిల్ ధర రూ.88.65కి పెరిగింది. ఇప్పటికే దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 మార్క్‌ను దాటింది. అత్యధికంగా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో 109.30 చేరగా.. డీజిల్ రూ.101.85కు చేరింది. కాగా.. మే 4 తేదీ నుంచి ఇప్పటి వరకు 31 సార్లు ఇంధన ధరలు పెంచారు. పెట్రోల్ రూ.7.79, డీజిల్‌పై 7.87 వరకు పెరిగింది.
ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు..
- ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.98.11, డీజిల్ రూ.88.65
- ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.104.22, డీజిల్ రూ.96.16
- చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.99.18, డీజిల్ రూ.93.22
- కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.97.99, డీజిల్ రూ.91.49
- భోపాల్‌లో లీటర్ పెట్రోల్ రూ.106.35, డీజిల్ రూ.97.37
- బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ.101.39, డీజిల్ రూ.93.98
- పాట్నాలో లీటర్ పెట్రోల్ రూ.100.13, డీజిల్ రూ.94
- చండీగఢ్‌లో లీటర్ పెట్రోల్ రూ.94.35, డీజిల్ రూ.88.29
- లక్నోలో లీటర్ పెట్రోల్ రూ.95.29, డీజిల్ రూ.89.06
- రాంచీలో లీటర్ పెట్రోల్ రూ.93.82, డీజిల్ రూ.93.57
- హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.101.96, డీజిల్ రూ.96.63
- విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.104.31, డీజిల్ రూ.98.38
కరోనా తగ్గుమఖం పట్టడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలకు డిమాండ్ పెరిగింది. దీంతో మూడేళ్ల గరిష్ఠానికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో శుక్రవారం బ్రెంట్ ముడి ధర బ్యారెల్‌కు 76 డాలర్లు దాటింది.