బాదుడే బాదుడు.. మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Petrol and Diesel price on June 24th.ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంత‌రం నుంచి పెట్రో ధ‌ర‌లు మండిపోతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jun 2021 2:19 AM GMT
బాదుడే బాదుడు.. మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంత‌రం నుంచి పెట్రో ధ‌ర‌లు మండిపోతున్నాయి. మే 4 నుంచి ఇప్పటి వరకు 30 సార్లు ధరలు పెరగ్గా.. లీటర్‌ పెట్రోల్‌పై రూ.7.44, డీజిల్‌పై రూ.7.52 పెరిగింది. గురువారం కూడా లీట‌ర్ పెట్రోల్‌పై 26 పైస‌లు, డీజిల్ పై 7 పైస‌ల వ‌ర‌కు పెంచాయి చ‌మురు కంపెనీలు. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.76, డీజిల్‌ రూ.88.30కి చేరింది. దేశంలో ఇప్ప‌టికే చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధ‌ర రూ.100 మార్క్‌ను దాట‌గా.. డీజిల్‌కు కూడా రూ.100 వైపు వేగంగా ప‌య‌నిస్తోంది. ఇక‌.. అంతర్జాతీయ మార్కెట్‌లో బుధవారం బ్రెంట్‌ ముడి చమురు ధర బ్యారెల్‌కు 75 డాలర్ల మార్క్‌ను దాటింది. గత రెండేళ్లలో బ్రెంట్‌ ముడి ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో పెట్రోల్‌ రూ.97.76, డీజిల్‌ రూ.88.30

- ముంబైలో పెట్రోల్‌ రూ.103.89, డీజిల్‌ రూ.95.79

- చెన్నైలో పెట్రోల్‌ రూ.98.88, డీజిల్‌ రూ.92.89

- కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.97.63, డీజిల్‌ రూ.91.15

- విజయవాడలో పెట్రోల్‌ రూ.103.53, డీజిల్‌ రూ.97.61

- బెంగళూరులో పెట్రోల్‌ రూ.101.03, డీజిల్‌ రూ.93.61

- పాట్నాలో పెట్రోల్‌ రూ.99.80, డీజిల్‌ రూ.93.63

- చండీగఢ్‌లో పెట్రోల్‌ రూ.94.02, డీజిల్‌ రూ.87.94

- లక్నోలో పెట్రోల్‌ రూ.94.95, డీజిల్‌ రూ.88.71

- హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.101.60, డీజిల్‌ రూ.96.25

Next Story