దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. గత కొద్ది రోజులు ఇంధన ధరలను పెంచుతూ చమురు కంపెనీలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో చాలా చోట్ల పెట్రోల్ ధర రూ.100 మార్క్‌ను దాటగా.. డీజిల్ సైతం రూ.100 మార్క్‌కు చేరువలో ఉంది. శనివారం ఒక్క రోజు విరామం తరువాత ఆదివారం మళ్లీ ధరలను పెంచాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 31 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి చమురు కంపెనీలు. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.22, డీజిల్ ధర రూ.87.97కి చేరింది. మే నెలలో 16 సార్లు ఇంధన ధరలు పెరుగగా.. జూన్‌లో ఇప్పటి వరకు 12 సార్లు పెరిగాయి.
ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
- ఢిల్లీలో పెట్రోల్ రూ.97.22, డీజిల్ రూ.87.97
- ముంబైలో పెట్రోల్ రూ.103.36, డీజిల్ రూ.95.44
- కోల్‌కతాలో పెట్రోల్ రూ.102.12, డీజిల్ రూ.90.82
- చెన్నైలో పెట్రోల్ రూ.98.40, డీజిల్ రూ.92.58
- భోపాల్‌లో పెట్రోల్ రూ.105.43, డీజిల్‌రూ.96.65
- రాంచీలో పెట్రోల్‌రూ.93.13, డీజిల్‌రూ.92.86
- బెంగళూరులో పెట్రోల్‌రూ.100.47, డీజిల్‌రూ.93.26
- పాట్నాలో పెట్రోల్‌రూ.99.28, డీజిల్‌రూ.93.30
- చండీగఢ్‌లో పెట్రోల్‌రూ.93.50, డీజిల్‌రూ.87.62
- లక్నోలో పెట్రోల్‌రూ.94.42, డీజిల్‌రూ.88.38
- హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.101.04, డీజిల్ రూ.95.89
- విజయవాడలో రూ.102.98, డీజిల్ రూ.97.26