ఆగ‌ని పెట్రో బాదుడు.. 27వ సారి వ‌డ్డింపు

Petrol and diesel price on june 18th.ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత నుంచి ఇంధ‌న ధ‌ర‌లు పెరుగుతూనే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Jun 2021 4:18 AM GMT
ఆగ‌ని పెట్రో బాదుడు.. 27వ సారి వ‌డ్డింపు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత నుంచి ఇంధ‌న ధ‌ర‌లు పెరుగుతూనే ఉన్నాయి. మే 4 తేదీ నుంచి నేటి వ‌ర‌కు 27 సార్లు ఇంధ‌న ధ‌ర‌లు పెరిగాయి. పెట్రోల్‌పై రూ.6.61, డీజిల్‌ రూ.6.91 పెరిగింది. ఓ వైపు క‌రోనా క‌ష్ట‌కాలం నుంచి తేరుకోక‌ముందే.. ఇంధ‌న పెరుగుతుండ‌డంతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. వాహ‌నాల‌ను బ‌య‌ట‌కు తీసేందుకే జంకుతున్నారు. తాజాగా శుక్ర‌వారం కూడా లీటర్‌ పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌పై 32 పైసలు వరకు పెరిగింది. పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.96.93, డీజిల్‌ రూ.87.69కు పెరిగింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఇలా..

- న్యూఢిల్లీలో పెట్రోల్‌ రూ.96.93, డీజిల్‌ రూ.87.69

- ముంబైలో పెట్రోల్‌ రూ.103.08, డీజిల్‌ రూ.95.14

- చెన్నైలో పెట్రోల్‌ రూ.98.14, డీజిల్‌ రూ.92.31

- కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.96.84, డీజిల్‌ రూ.90.54

- భోపాల్‌లో పెట్రోల్ రూ.105.13, డీజిల్‌ రూ.96.35

- రాంచీలో పెట్రోల్‌ రూ.92.91, డీజిల్‌ రూ.92.57

- బెంగళూరులో పెట్రోల్‌ రూ.100.17, డీజిల్‌ రూ.92.97

- పాట్నాలో పెట్రోల్‌ రూ.99, డీజిల్‌ రూ.93.01

- చండీగఢ్‌లో పెట్రోల్‌ రూ.93.22, డీజిల్‌ రూ.87.34

- లక్నోలో పెట్రోల్‌ రూ.94.14, డీజిల్‌ రూ.88.10

- హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.100.74, డీజిల్ రూ.95.59

- విజయవాడలో పెట్రోల్‌ రూ.102.69, డీజిల్‌ రూ.96.97

మరో వైపు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పెట్రోల్‌ రూ.105 మార్క్‌ను దాటింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్‌ రూ.108.07 డీజిల్‌ రూ.100.82కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా.. దేశంలో చమురు కంపెనీలు ధరలను పెంచాయి. గురువారం అమెరికా మార్కెట్లో ట్రేడింగ్ ముగిసే సమయానికి బ్రెంట్ ముడి బ్యారెల్‌కు 1.31 డాలర్లు తగ్గి 73.08 డాలర్లకు పడిపోయింది. యూఎస్‌ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ 1.11 డాలర్లు తగ్గి బ్యారెల్‌ 71.04 వద్ద ట్రేడవుతోంది.


Next Story