సామాన్యులకు ఇంధన ధరలు షాకిస్తున్నాయి. నిన్న ఒక్క రోజు ధరల పెంపుకు కాస్త విరామం ఇచ్చిన చమురు కంపెనీలు నేడు(శుక్రవారం) పెట్రోల్‌పై లీటర్‌కు 29పైసలు, డీజిల్ పై 28 పైసలు పెంచాయి. కరోనా కష్టకాలంలో ఇంధన ధరలు పెరుగుతుండడంతో సామాన్యుడి బతుకు బండి లాగడం చాలా కష్టంగా మారింది. పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.85కు చేరింది. లీటర్ డీజిల్ రూ.86.75కు పెరిగింది. కాగా.. ఈ నెలలో(జూన్)లో నేటితో కలిపి ఆరు సార్లు ధరలు పెరుగగా.. మే 4వ తేదీ నుంచి 23 సార్లు చమురు ధరలు పెరిగాయి.
ఇక దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్‌ను దాటింది. డీజిల్ సైతం రూ.100 వైపు పరుగులు పెడుతోంది. దేశంలోనే అత్యధికంగా శ్రీగంగానగర్‌లో లీటర్ పెట్రోల్ రూ.106 మార్క్‌ను దాటగా.. డీజిల్ ధర రూ.99 దాటింది.