ఢిల్లీలో కూడా వంద దాటేసింది..

Petrol and Diesel price on July 6th.దేశంలో ఇంధ‌న ధ‌ర‌లు ప‌రుగులు పెడుతున్నాయి. పెరుగుతున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 July 2021 9:24 AM IST
ఢిల్లీలో కూడా వంద దాటేసింది..

దేశంలో ఇంధ‌న ధ‌ర‌లు ప‌రుగులు పెడుతున్నాయి. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌తో సామాన్యుడి వాహానాల‌ను బ‌య‌ట‌కు తీయాలంటేనే బెంబేలెత్తిపోతున్నాడు. ఇక దేశ రాజ‌ధాని ఢిల్లీ, కోల్‌క‌తా న‌గ‌రంలో కూడా పెట్రోల్ ధ‌ర సెంచ‌రీ మార్క్‌ను దాటింది. తాజాగా పెట్రోల్‌పై 35, డీజిల్‌పై 17 పైసలు పెంచాయి. కొత్తగా పెంచిన ధరలతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.100.21కు చేరగా డీజిల్‌ రూ.89.53కు చేరింది. ఈ నెల‌లో ఇప్పటి వ‌ర‌కు ఇంధన ధరలు ఐదుసార్లు పెరగ్గా.. మే 4వ తేదీ తర్వాత 37 సార్లు పెరిగాయి.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో పెట్రోల్‌ రూ.100.21, డీజిల్‌ రూ.89.53

- ముంబైలో పెట్రోల్‌ రూ.106.25, డీజిల్‌ రూ.97.09

- కోల్‌కతా పెట్రోల్ రూ.100.23, డీజిల్‌ రూ.92.50

- చెన్నైలో పెట్రోల్‌ రూ.101.06, డీజిల్‌ రూ.94.06

- బెంగళూరులో పెట్రోల్ రూ.103.56, డీజిల్ రూ.94.89

- పాట్నాలో పెట్రోల్ రూ.102.40, డీజిల్‌ రూ.94.99

- చండీగఢ్‌లో పెట్రోల్‌ రూ.93.37, డీజిల్‌ రూ.89.16

- భోపాల్‌లో రూ.108.52, డీజిల్‌ రూ.98.30

- లక్నోలో పెట్రోల్‌ రూ.97.33, డీజిల్‌ రూ.89.92

- రాంచీలో పెట్రోల్‌ రూ.94.43, డీజిల్‌ రూ.94.48

- హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.104.14.. డీజిల్‌ రూ.97.58

Next Story