చుక్క‌లు చూపిస్తున్న ఇంధ‌న ధ‌ర‌లు.. మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్

Petrol and Diesel price on July 3rd.పెరుగుతున్న ఇంధ‌న ధ‌ర‌లు సామాన్యుడికి చుక్క‌లు చూపిస్తున్నాయి. దీంతో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 July 2021 2:42 AM GMT
చుక్క‌లు చూపిస్తున్న ఇంధ‌న ధ‌ర‌లు.. మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్

పెరుగుతున్న ఇంధ‌న ధ‌ర‌లు సామాన్యుడికి చుక్క‌లు చూపిస్తున్నాయి. దీంతో వాహ‌నాల‌ను బ‌య‌ట‌కు తీయాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. ఆదివారం మ‌రోసారి ఇంధ‌న ధ‌ర‌ల‌ను పెంచాయి చమురు కంపెనీలు. పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 20 పైసల వరకు పెంచాయి. తాజాగా పెరిగిన ధ‌ర‌ల‌తో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.99.51, డీజిల్‌ రూ.89.36కు చేరాయి. మే 4వ తర్వాత నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌ ధరలను చమురు కంపెనీలు 35 సార్లు పెంచింది. మొత్తంగా రూ.9.19 వరకు పెరిగింది. డీజిల్‌ రేట్లు 34 సార్లు పెరగ్గా.. రూ.8.57 వరకు పెరుగుదల నమోదైంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఇంధ‌న ధ‌ర‌లు..

- ఢిల్లీలో పెట్రోల్‌ రూ.99.51, డీజిల్‌ రూ.89.36

- ముంబైలో పెట్రోల్‌ రూ.105.98, డీజిల్‌ రూ.96.91

- కోల్‌కతా పెట్రోల్ రూ.99.44, డీజిల్‌ రూ.92.27

- చెన్నైలో పెట్రోల్‌ రూ.100.44, డీజిల్‌ రూ.94.72

- బెంగళూరులో పెట్రోల్ రూ.102.84, డీజిల్ రూ.94.54

- పాట్నాలో పెట్రోల్ రూ.101.62, డీజిల్‌ రూ.94.76

- చండీగఢ్‌లో పెట్రోల్‌ రూ.95.70, డీజిల్‌ రూ.89

- భోపాల్‌లో రూ.107.80, డీజిల్‌ రూ.98.13

- లక్నోలో పెట్రోల్‌ రూ.96.65, డీజిల్‌ రూ.89.75

- రాంచీలో పెట్రోల్‌ రూ.94.89, డీజిల్‌ రూ.94.31

- హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.103.41, డీజిల్‌ రూ.97.40

Next Story