సామాన్యుడికి గుదిబండగా పెట్రోల్.. మ‌ళ్లీ పెరిగిన ధ‌ర‌

Petrol and Diesel price on July 2nd.పెరుగుతున్న ఇంధ‌న ధ‌ర‌లు సామాన్యుడికి పెనుభారంగా మారుతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 July 2021 3:57 AM GMT
సామాన్యుడికి గుదిబండగా పెట్రోల్.. మ‌ళ్లీ పెరిగిన ధ‌ర‌

పెరుగుతున్న ఇంధ‌న ధ‌ర‌లు సామాన్యుడికి పెనుభారంగా మారుతున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్నాయే త‌ప్ప త‌గ్గ‌డం లేదు. దీంతో వాహ‌న‌దారులు వాహ‌నాన్ని బ‌య‌ట‌కు తీయాలంటే బెంబేలెత్తిపోయే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. రెండు రోజులు విరామం ఇచ్చిన అనంత‌రం శుక్ర‌వారం మ‌రో సారి పెట్రో ధ‌ర‌లు పైకి క‌దిలాయి. అయితే.. డిజీల్ రేట్లు మాత్రం పెంచ‌లేదు చ‌మురు కంపెనీలు.

తాజాగా పెట్రోల్ పై 35 పైస‌లు పెరిగింది. పెంచిన ధరతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ రేటు రూ.100కు చేరువైంది. ప్రస్తుతం రూ.99.16 ధర పలుకుతోంది. డీజిల్‌ రూ.89.15కు పెరిగింది. మే 4వ తర్వాత ఇప్పటి వరకు పెట్రోల్‌ ధరలు 33 సార్లు పెరిగాయి.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ధ‌ర‌లు..

- ఢిల్లీలో పెట్రోల్‌ రూ.99.16, డీజిల్‌ రూ.89.18

- ముంబైలో పెట్రోల్‌ రూ.105.24, డీజిల్‌ రూ.96.72

- కోల్‌కతా పెట్రోల్ రూ.99.04, డీజిల్‌ రూ.92.03

- చెన్నైలో పెట్రోల్‌ రూ.100.13, డీజిల్‌ రూ.93.72

- బెంగళూరులో పెట్రోల్ రూ.102.48, డీజిల్ రూ.94.54

- తిరువనంతపురంలో పెట్రోల్‌ రూ.101.14, డీజిల్‌ రూ.95.74

- జైపూర్‌లో రూ.105.91, డీజిల్‌ రూ.98.29

- పాట్నాలో పెట్రోల్ రూ.101.21, డీజిల్‌ రూ.94.52

- చండీగఢ్‌లో పెట్రోల్‌ రూ.95.36, డీజిల్‌ రూ.88.81

- భోపాల్‌లో రూ.107.43, డీజిల్‌ రూ.97.93

- భువనేశ్వర్‌లో పెట్రోల్ రూ.99.95, డీజిల్ రూ.97.19

- శ్రీనగర్‌లో పెట్రోల్‌ రూ.102.11, డీజిల్‌ రూ.92.80

- హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.103.05.. డీజిల్‌ రూ.97.20

- విజయవాడలో పెట్రోల్‌ రూ.105.17 డీజిల్‌ రూ.98.73

Next Story