కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. నిత్యం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంతో వాహనదారులు వాహనాలను తీసేందుకు జంకుతున్నారు. రోజువారీ సమీక్షలో భాగంగా ఈరోజు లీటరు పెట్రోల్ పై 25పైసలు, డీజిల్‌పై 26 పైసలు చొప్పున పెంచాయి చమురు కంపెనీలు. తాజాగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.100.91కి చేరగా, డీజిల్ ధర రూ.89.88కి పెరిగింది. ఇప్పటికే దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర సెంచరీ మార్క్‌ను దాటిన సంగతి తెలిసిందే.