గత రెండు వారాలుగా పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తమ వాహనాలను బయటకు తీయాలంటేనే భయపడేపరిస్థితి నెలకొంది. మార్చి 22 నుంచి ఇంధన ధరలపై రోజుకు దాదాపు రూపాయి వరకు పెంచుకుంటూ వస్తున్నాయి చమురు కంపెనీలు. అయితే.. నేడు మాత్రం కాస్త బ్రేక్ ను ఇచ్చాయి. గురువారం ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 కి ఉండగా.. డీజిల్ ధర రూ.96.67 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
- ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.105.41, డీజిల్ ధర రూ. 96.67
- ముంబైలో పెట్రోల్ ధర రూ. 120.51, డీజిల్ ధర రూ. 104.77
- చెన్నైలో పెట్రోల్ ధర రూ. 110.95, డీజిల్ ధర రూ. 101.04
- కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 115.12, డీజిల్ ధర రూ. 99.83
- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 119.49, డీజిల్ ధర రూ. 105.49
- విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 119.47, డీజిల్ ధర రూ.106.40
- గుంటూరులో పెట్రోల్ ధర రూ. 121.02, డీజిల్ ధర రూ.106.65
మీ ప్రాంతంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత ఉన్నాయో ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ రేట్లు తెలుసుకోవాలంటే మీరు మీ ఫోన్ నుంచి 9224992249 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. మీరు హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ రేట్లు తెలుసుకోవాలంటే RSP 134483 అని టైప్ చేసి 9224992249 ఫోన్ నెంబర్‌కు మెసేజ్ పంపితే.. నేటి ధరలు తెలుసుకోవచ్చు.