త‌గ్గేదేలే.. 16 రోజుల్లో 14 సార్లు ఇంధ‌న ధ‌ర‌లు పెంపు

Petrol and Diesel price on April 6th.నిత్యం పెరుగుతున్న ఇంధ‌న‌ల ధ‌ర‌లు సామాన్యుడికి చుక్క‌లు చూపిస్తున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 April 2022 2:45 AM GMT
త‌గ్గేదేలే.. 16 రోజుల్లో 14 సార్లు ఇంధ‌న ధ‌ర‌లు పెంపు

నిత్యం పెరుగుతున్న ఇంధ‌న‌ల ధ‌ర‌లు సామాన్యుడికి చుక్క‌లు చూపిస్తున్నాయి. దేశీయ చ‌మురు కంపెనీలు పెట్రోల్‌, డీజిల్ పై రోజు దాదాపు ఓ రూపాయి చొప్పున పెంచుతున్నాయి. మార్చి 22న ప్రారంభ‌మైన ఈ వ‌డ్డింపు నేడు కూడా కొన‌సాగింది. బుధ‌వారం లీట‌ర్ పెట్రోల్ పై 90పైస‌లు, డీజిల్‌పై 87 పైస‌లు పెంచాయి. తాజాగా పెరిగిన ధ‌ర‌ల‌తో దేశ రాజ‌ధాని ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.105.41 కి చేర‌గా.. డీజిల్ ధ‌ర రూ.96.67కి పెరిగింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో పెట్రోల్ ధ‌ర రూ.105.41, డీజిల్ ధ‌ర రూ. 96.67

- ముంబైలో పెట్రోల్ ధ‌ర రూ. 120.51, డీజిల్ ధ‌ర రూ. 104.77

- చెన్నైలో పెట్రోల్ ధ‌ర రూ. 110.95, డీజిల్ ధ‌ర రూ. 101.04

- కోల్‌క‌తాలో పెట్రోల్ ధ‌ర రూ. 115.12, డీజిల్ ధ‌ర రూ. 99.83

- హైదరాబాద్‌లో పెట్రోల్ ధ‌ర రూ. 119.49, డీజిల్ ధ‌ర రూ. 105.49

- విశాఖ‌ప‌ట్నంలో పెట్రోల్ ధ‌ర రూ. 119.47, డీజిల్ ధ‌ర రూ.106.40

- గుంటూరులో పెట్రోల్ ధ‌ర రూ. 121.02, డీజిల్ ధ‌ర రూ.106.65

మార్చి 22 నుంచి ఇంధ‌న ధ‌ర‌లు పెంపు ప్రారంభ‌మైంది. ఒక‌టి లేదా రెండు రోజులు మిన‌హా నిత్యం ఇంధ‌న ధ‌ర‌ల‌ను పెంచుకుంటూ వ‌స్తున్నాయి చ‌మురు కంపెనీలు. గ‌త 16 రోజుల్లో 14 సార్లు ధ‌ర‌ల‌ను పెంచాయి. లీట‌ర్ పెట్రోల్‌, డీజిల్ పై ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు రూ.12 వ‌ర‌కు పెరిగింది.

మీ ప్రాంతంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఎంత ఉన్నాయో ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. ఇండియన్ ఆయిల్ రేట్లు తెలుసుకోవాలంటే మీరు మీ ఫోన్ నుంచి 9224992249 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. మీరు హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ రేట్లు తెలుసుకోవాలంటే RSP 134483 అని టైప్ చేసి 9224992249 ఫోన్ నెంబర్‌కు మెసేజ్ పంపితే.. నేటి ధ‌ర‌లు తెలుసుకోవ‌చ్చు.

Next Story