ఆగ‌ని బాదుడు.. ఏపీలో రూ.120 దాటిన లీట‌ర్ పెట్రోల్‌

Petrol and Diesel price on April 5th.ఇంధన ధ‌ర‌లు భ‌గ్గుమంటున్నాయి. నిత్యం పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 April 2022 3:04 AM GMT
ఆగ‌ని బాదుడు.. ఏపీలో రూ.120 దాటిన లీట‌ర్ పెట్రోల్‌

ఇంధన ధ‌ర‌లు భ‌గ్గుమంటున్నాయి. నిత్యం పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతుండ‌డంతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. వాహ‌న‌దారులు త‌మ వాహ‌నాల‌ను బ‌య‌ట‌కు తీయాలంటేనే జంకుతున్నారు. దేశ వ్యాప్తంగా నేడు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఈ రోజు పెంచేశాయి చమురు కంపెనీలు. మంగ‌ళ‌వారం లీట‌ర్ పెట్రోల్‌పై 91 పైస‌లు, డీజిల్‌పై 87 పైస‌లు పెంచాయి. తాజాగా పెరిగిన ధ‌ర‌ల‌తో దేశ రాజ‌ధాని ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.104.61 కి చేర‌గా.. డీజిల్ ధ‌ర రూ.95.87కి పెరిగింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో పెట్రోల్ ధ‌ర రూ.104.61, డీజిల్ ధ‌ర రూ. 95.87

- ముంబైలో పెట్రోల్ ధ‌ర రూ. 119.67, డీజిల్ ధ‌ర రూ. 103.92

- చెన్నైలో పెట్రోల్ ధ‌ర రూ. 110.11, డీజిల్ ధ‌ర రూ. 100.19

- కోల్‌క‌తాలో పెట్రోల్ ధ‌ర రూ. 114.28, డీజిల్ ధ‌ర రూ. 99.02

- హైదరాబాద్‌లో పెట్రోల్ ధ‌ర రూ. 118.59, డీజిల్ ధ‌ర రూ. 104.62

- విజ‌య‌వాడ‌లో పెట్రోల్ ధ‌ర రూ. 120.18, డీజిల్ ధ‌ర రూ.105.84

- గుంటూరులో పెట్రోల్ ధ‌ర రూ. 120.38, డీజిల్ ధ‌ర రూ.106.04

మార్చి 22 నుంచి ఇంధ‌న ధ‌ర‌లు పెంపు ప్రారంభ‌మైంది. ఒక‌టి లేదా రెండు రోజులు మిన‌హా నిత్యం ఇంధ‌న ధ‌ర‌ల‌ను పెంచుకుంటూ వ‌స్తున్నాయి చ‌మురు కంపెనీలు. గ‌త 15 రోజుల్లో 13 సార్లు ధ‌ర‌ల‌ను పెంచాయి. లీట‌ర్ పెట్రోల్‌, డీజిల్ పై ఇప్ప‌టి వ‌ర‌కు రూ.11 వ‌ర‌కు పెరిగింది.

మీ ప్రాంతంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఎంత ఉన్నాయో ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. ఇండియన్ ఆయిల్ రేట్లు తెలుసుకోవాలంటే మీరు మీ ఫోన్ నుంచి 9224992249 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. మీరు హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ రేట్లు తెలుసుకోవాలంటే RSP 134483 అని టైప్ చేసి 9224992249 ఫోన్ నెంబర్‌కు మెసేజ్ పంపితే.. నేటి ధ‌ర‌లు తెలుసుకోవ‌చ్చు.

Next Story