మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరలు.. హైద‌రాబాద్‌లో ఎంతంటే

Petrol and Diesel price on April 3rd.ఇంధ‌న ధ‌ర‌ల‌ను మ‌రో సారి పెంచాయి చ‌మురు సంస్థ‌లు. వ‌రుస వ‌డ్డింపున‌కు శుక్ర‌వారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 April 2022 8:51 AM IST
మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరలు.. హైద‌రాబాద్‌లో ఎంతంటే

ఇంధ‌న ధ‌ర‌ల‌ను మ‌రో సారి పెంచాయి చ‌మురు సంస్థ‌లు. వ‌రుస వ‌డ్డింపున‌కు శుక్ర‌వారం కాస్త విరామం ఇచ్చిన చ‌మురు కంపెనీలు శ‌నివారం నుంచి మ‌ళ్లీ పెంపు మొద‌లెట్టాయి. నేడు కూడా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరిగాయి. ఆదివారం లీట‌ర్ పెట్రోల్ పై 92 పైస‌లు, డీజిల్ పై 87 చొప్పున పెంచాయి. తాజాగా పెంపుతో ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్‌ ధర రూ.103.41 చేర‌గా డీజిల్‌ రూ.94.67కు పెరిగింది. మార్చి 22 నుంచి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచ‌డం ఇది 11వ సారి.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో పెట్రోల్ ధ‌ర రూ.103.41, డీజిల్ ధ‌ర రూ. 94.67

- ముంబైలో పెట్రోల్ ధ‌ర రూ. 118.41, డీజిల్ ధ‌ర రూ. 102.64

- చెన్నైలో పెట్రోల్ ధ‌ర రూ. 108.96, డీజిల్ ధ‌ర రూ. 108.96

- కోల్‌క‌తాలో పెట్రోల్ ధ‌ర రూ. 113.03, డీజిల్ ధ‌ర రూ. 97.82

- హైదరాబాద్‌లో పెట్రోల్ ధ‌ర రూ. 117.25, డీజిల్ ధ‌ర రూ. 103.32

- విజ‌య‌వాడ‌లో పెట్రోల్ ధ‌ర రూ. 118.15, డీజిల్ ధ‌ర రూ.104.06

- గుంటూరులో పెట్రోల్ ధ‌ర రూ. 119.07, డీజిల్ ధ‌ర రూ.104.78

మీ ప్రాంతంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఎంత ఉన్నాయో ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. ఇండియన్ ఆయిల్ రేట్లు తెలుసుకోవాలంటే మీరు మీ ఫోన్ నుంచి 9224992249 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. మీరు హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ రేట్లు తెలుసుకోవాలంటే RSP 134483 అని టైప్ చేసి 9224992249 ఫోన్ నెంబర్‌కు మెసేజ్ పంపితే.. నేటి ధ‌ర‌లు తెలుసుకోవ‌చ్చు.

Next Story