క్యూఆర్‌లు, సౌండ్‌బాక్స్‌లు పనిచేస్తూనే ఉంటాయి: పేటీఎం

డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్‌ గురించి ఓ వార్తా పత్రిలో వచ్చిన ప్రకటనను షేర్‌ చేస్తూ క్లారిటీ ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on  19 Feb 2024 11:45 AM GMT
paytm, tweet,  rbi,

క్యూఆర్‌లు, సౌండ్‌బాక్స్‌లు పనిచేస్తూనే ఉంటాయి: పేటీఎం

పేటీఎం వ్యాలెట్, పేమెంట్స్‌ ద్వారా కోట్లాది రూపాయల మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఆర్బీఐ చర్యలు తీసుకుంది. ఆడిట్ నివేదిక వచ్చిన తర్వాత పేమెంట్స్‌పై ఆంక్షలు విదిస్తున్నట్లు తెలిపింది. దాంతో.. పేటీఎం వినియోగదారులంతా ఆందోళన చెబుతుందున్నారు. సంస్థ కార్యకలాపాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పేటీఎం సంస్థ ఎక్స్‌ వేదికగా ఒక పోస్టు పెట్టింది. డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్‌ గురించి ఓ వార్తా పత్రిలో వచ్చిన ప్రకటనను షేర్‌ చేస్తూ క్లారిటీ ఇచ్చారు.

భారత్‌లోని పేటీఎం క్యూఆర్, సౌండ్‌బాక్సులు పనిచేస్తూనే ఉంటాయని సంస్థ తెలిపింది. ఈ రోజు, రేపు, ఎల్లప్పుడూ పేటీఎం చేయాలని పోస్టు ద్వారా తెలిపింది. అలాగే క్యూఆర్ కోడ్, సౌండ్‌బాక్సులకు సంబంధించిన వందంతులను నమ్మొద్దని చెప్పింది. ఇలాంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలంటూ కస్టమర్లను కోరింది పేటీఎం సంస్థ. జనవరి 31వ తేదీన పేటీఎంపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. కస్టమర్ల ఆందోళనను దృష్టిలో పెట్టుకున్న ఆర్బీఐ ఒక వెసులుబాటు కల్పించింది. ఆంక్షలను విధించే తేదీని పొడిగిస్తున్నట్లు తెలిపింది.

ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లలో డిపాజిట్లు, టాప్‌-అప్‌లు స్వీకరించొద్దంటూ ఆదేశాల్లో పేర్కొంది ఆర్‌బీఐ. తాజాగా ఈ గడువుని మార్చి 15వ తేదీ వరకు పొడిగించింది. పీబీఎల్‌ ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.


Next Story