పేటీఎం పేమెంట్స్‌కు ఆర్‌బీఐ మరో 15 రోజుల గడువు

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకుపై ఇటీవల ఆర్‌బీఐ పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  16 Feb 2024 2:00 PM GMT
paytm, payments,  march 15th, rbi,

  పేటీఎం పేమెంట్స్‌కు ఆర్‌బీఐ మరో 15 రోజుల గడువు

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకుపై ఇటీవల ఆర్‌బీఐ పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 29 నుంచే ఆంక్షలు అమలు అవుతాయని చెప్పింది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ గడువుని ఇంకాస్త సమయం పొడిగించింది ఆర్‌బీఐ. పేమెంట్స్ బ్యాంక్ సంబంధిత సర్వీసులు మార్చి 15వ తేదీ వరకు కొనసాగుతాయని వెల్లడించింది. ఇదే సమయంలో కస్టమర్లలో ఉన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానాలతో FAQs విడుదల చేసింది. కస్టమర్ల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

పీపీబీఎల్‌ ఖాతాదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నగదు విత్‌డ్రా చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ వివరించింది. అయితే.. కేవైసీకి సంబంధించి సరైన నిబంధనలు పాటించనందున ఆడిట్‌ చేసిన ఆర్‌బీఐ పేటీఎం బ్యాంకుపై జనవరి 31వ తేదీన చర్యలు తీసుకుంది. పేటీఎం వ్యాలెట్, పేమెంట్స్ ద్వారా కోట్లాది రూపాయల మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. సంస్థ కూడా ఇంకా కొన్ని నిబంధనలు ఉల్లంఘించిందని, పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని ఆడిట్‌లో తేలింది.

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేసుకోవడం లేదా డబ్బులు తీసుకోవడం ఇతర సేవల వినియోగానికి అవకాశం కల్పించింది ఆర్‌బీఐ. ఈ క్రమంలోనే పేటీఎం బ్యాంక్ లైసెన్స్ రద్దు చేస్తుందనే అనుమానాలు ఉన్నాయి. ఇంకొంత సమయం ఇచ్చిన నేపథ్యంలో లైసెన్స్ రద్దు చేసే యోచనలోనే కేంద్ర బ్యాంకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫాస్టాగ్ జారీ బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును తొలగించింది జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ.

Next Story